

హీరో విజయ్ దేవరకొండ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందే లక్ష్యంతో మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. హాయ్ నాన్న ఫేమ్ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వైరా బ్యానర్‌పై నిర్మితమవుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలతోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.
ఈ చిత్రానికి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా, ఎరిక్ డస్ట్ర్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా సురేష్ సెల్వరాజన్, సంగీత దర్శకుడిగా హేషమ్ అబ్దుల్ వాహాబ్ వ్యవహరిస్తున్నారు. పోస్టర్లో విజయ్ దేవరకొండ నాలుగు పెట్ డాగ్స్‌తో నడుస్తూ, వెనుక ఆయుధాలతో ఉన్న వ్యక్తులు కనిపించడం ఆకర్షణీయంగా ఉంది. “ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ” అనే క్యాప్షన్ కథపై క్యూరియాసిటీ పెంచుతోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!