
న్యూస్

బిహార్‌లో తొలిసారి భాజపా ప్రభుత్వం కొలువు దీరేందుకు రంగం సిద్ధమైంది. పగ్గాలు చేపట్టబోతున్న కమలనాథుడు ఎవరనేది మంగళవారం తేలే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించి, సీఎం పదవి నుంచి వైదొలగుతున్నట్లు నీతీశ్‌కుమార్ లాంఛనంగా ప్రకటించనున్నారు. ఆ వెంటనే లోక్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఎన్నికైనప్పటి నుంచి తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. 243 సీట్లున్న బిహార్ శాసనసభలో ఎన్డీయేకి 202 మంది సభ్యుల బలం ఉంది. ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ కొత్త సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బలంగా వినిపిస్తోంది. కేంద్ర సహాయమంత్రి నిత్యానంద రాయ్ పేరు కూడా వినవస్తోంది. మరోవైపు.. నీతీశ్ తనయుడు నిశాంత్‌ను కొత్త క్యాబినెట్లోకి తీసుకుంటారని తెలుస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!