

‘జన నాయకన్’ సినిమా తర్వాత దర్శకుడు హెచ్ వినోద్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఆయన హీరో కార్తీతో మరోసారి జట్టు కట్టబోతున్నారు. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘ఖాకీ’కి సీక్వెల్‌గా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి విజయాన్ని సాధించి, కార్తీ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
మరోవైపు దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ 2’ సినిమా తన తదుపరి ప్రాజెక్ట్ పూర్తయ్యాకే ప్రారంభిస్తానని ఇప్పటికే సూచించారు. ఈ కారణంగా ఆ సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో, ఈ గ్యాప్‌లో కార్తీ ‘ఖాకీ 2’ను పూర్తి చేసే అవకాశం ఉంది. ఇలా వరుసగా రెండు సీక్వెల్స్ రావడం ఆయన కెరీర్‌కు మంచి బలం ఇవ్వవచ్చు.
ప్రస్తుతం కార్తీకి బాక్సాఫీస్ వద్ద ఒక మంచి హిట్ అవసరం ఉంది. ఈ తరహా క్రేజీ ప్రాజెక్టులు ప్రారంభమైతే ఆయన గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వగలడని అభిమానులు ఆశిస్తున్నారు. హెచ్ వినోద్ పరిశోధనాత్మక థ్రిల్లర్ సినిమాలు చేయడంలో నిపుణుడు కావడంతో, ‘ఖాకీ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!