

రాష్ట్రంలో వచ్చే నెలలో మద్యం ధరలను పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరలను నిర్ణయించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఒక పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి, ఒక మాజీ ఉన్నతాధికారి, ఒక ఆడిటర్ ఉన్నారు. మద్యం తయారీ సంస్థల ప్రతిపాదనలను పరిశీలించి ఈ నెలాఖరుకు నివేదిక ఇవ్వనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ధరలను సమీక్షించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మద్యం తయారీ ఖర్చులు పెరగడం, ముఖ్యంగా సీసాల తయారీ వ్యయం అధికం కావడం వల్ల కంపెనీలు ధరల పెంపును కోరుతున్నాయి. 12 నుంచి 15 శాతం వరకు పెంపు కోరినా, ప్రజలపై భారం పడకుండా 3 నుంచి 5 శాతం మధ్య పెంచే అవకాశం ఉందని సమాచారం. సాధారణ రకాల సీసాలపై రూ. 60 నుంచి 80 వరకు, ప్రీమియం రకాలపై రూ. 100 నుంచి 120 వరకు పెంపు ఉండొచ్చని అంచనా. ఈ పెంపుతో ప్రభుత్వానికి నెలకు సుమారు రూ. 300 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశముంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!