

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పులపై కేంద్రానికి లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20,000 ఎకరాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర సాధికార కమిటీకి ప్రతిపాదనలు పంపింది. అలాగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టాండింగ్ కమిటీ 48వ సమావేశంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం ఉన్న సరిహద్దులపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, దీనివల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర సాధికార కమిటీ అనుమతి కోరాలని తీర్మానం చేశారు. 2018 నుంచి అమల్లో ఉన్న స్టేను ఎత్తివేసి, తదుపరి చర్యలకు అనుమతి ఇవ్వాలని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!