

గతంలో భారీ విజయాన్ని అందుకున్న సైయారా సినిమా టీమ్ మళ్లీ ఒక కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మోహిత్ సూరి, నిర్మాత అక్షయ్ విధాని (యశ్ రాజ్ ఫిల్మ్స్), అలాగే యువ నటులు అహన్ పాండే, అనీత్ పద్దా ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలిశారు. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు కాలేదు. ఈ సినిమా భావోద్వేగాలతో నిండిన ఇంటెన్స్ రొమాంటిక్ స్టోరీగా రూపొందుతోంది. హృదయాన్ని తాకే కథ, గుర్తుండిపోయే సంగీతంతో ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో టీమ్ పని చేస్తోంది.
సైయారా సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. భారత్లో వందల కోట్ల వసూళ్లు సాధించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా ఇందులోని పాటలు యువతలో పెద్ద ఎత్తున ఆదరణ పొందాయి. అహన్ పాండే, అనీత్ పద్దా జంటగా కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చింది.ఇప్పుడు మళ్లీ ఈ జంట కలిసి నటించబోతుండటంతో అంచనాలు పెరిగాయి.
దర్శకుడు మోహిత్ సూరి మాట్లాడుతూ ప్రేమ కథలు తనకు ఎంతో ఇష్టమని, భావోద్వేగాలు బలంగా వ్యక్తమయ్యే కథలు చేయడం తనకు ప్రత్యేక అనుభూతి ఇస్తుందని చెప్పారు. కొత్త సినిమా కూడా అలాంటి భావాలను అందిస్తుందని తెలిపారు. నిర్మాత అక్షయ్ విధాని మాట్లాడుతూ, మోహిత్ సూరితో కలిసి పని చేయడం అంటే కేవలం సినిమా కాదు, ఒక అనుభూతిని సృష్టించడం అని చెప్పారు. ఈసారి మరింత లోతైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా 2027 లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!