

న్యూఢిల్లీ లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలను కలిసి బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌లో భాగంగా ఈ ప్రతిపాదనలను వివరించారు.
అలాగే హైదరాబాద్‌లో పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కు రీసైక్లింగ్ యూనిట్, హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీ తయారీ కేంద్రాలు, ఆటో మరియు రక్షణ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు, మెషిన్ టూల్స్, రోబోటిక్స్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. 2034 నాటికి హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు సహకారం అందించాలని కోరారు.







.webp&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!