
క్రీడలు

భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ధురంధర్ ఫ్రాంచైజీ భారీ సంచలనాన్ని సృష్టించింది. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ₹3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సిరీస్ కలెక్షన్ల పరంగా అజేయంగా కొనసాగుతోంది.
ఈ ఫ్రాంచైజీలోని రెండు భాగాలు కలిపి ₹3000 కోట్ల మార్క్‌ను దాటడంతో, ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి (₹2438 కోట్లు), పుష్ప (₹2092 కోట్లు) రికార్డులను అధిగమించింది. ధురంధర్ 1 ₹1307 కోట్లు, ధురంధర్: ది రివెంజ్ 2 ₹1712 కోట్లు వసూలు చేయగా, చైనా, గల్ఫ్ దేశాల్లో విడుదల కాకుండానే ఈ స్థాయి కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!