
గాసిప్స్

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న “మా ఇంటి బంగారం” సినిమా నుంచి ‘తస్సాదియ్యా’ అనే ఫస్ట్ సాంగ్ విడుదలై మంచి స్పందనను తెచ్చుకుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో అంచనాలు పెరగగా, తాజా పాట పెళ్లి వేడుకల్లో మార్మోగేలా ఆకట్టుకుంటోంది.
సంతోష్ నారాయణన్ స్వరపరిచిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా, చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించారు. సమంత ఎనర్జిటిక్ స్టెప్పులు, ఆకట్టుకునే ప్రదర్శన పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా మే 15న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!