

తెలంగాణలో మహిళలకు ఉచిత చీరల పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి చీరలకు కొత్త రంగు, డిజైన్‌ను తీసుకొస్తూ చిలకపచ్చ రంగును ఎంపిక చేసింది. సెర్ప్ ద్వారా టెస్కోకు కోటి చీరల తయారీ కోసం రూ.450 కోట్ల ఆర్డర్ ఇవ్వగా, నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. గతంలో నీలం రంగు చీరలు ఇవ్వగా, ప్రతి సంవత్సరం రంగుల్లో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈసారి కొత్త డిజైన్ ఎంపికైంది.
చిలకపచ్చ రంగుతో ఎరుపు జరీ డిజైన్ కలిగిన చీరను అధికారులు సిద్ధం చేసిన నమూనాల్లో నుంచి ఎంపిక చేశారు. గత ఏడాది 86 లక్షల మందికి చీరలు పంపిణీ చేసిన ప్రభుత్వం, ఈసారి గ్రామీణ–పట్టణ ప్రాంతాలకు ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని నేత కార్మికులతో తయారీ పనులు చేపట్టి అక్టోబర్ నాటికి సిద్ధం చేసి, నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!