
న్యూస్

కేరళలోని కాలికట్లో సంగీతం మరియు వాస్తుశిల్పం కలయికతో ప్రపంచంలోనే అతిపెద్ద సౌండ్ హీలింగ్ డోమ్ నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పర్యవేక్షణలో రూపొందిన ఈ నిర్మాణం ది గ్రేట్ సెల్ఫ్ రిట్రీట్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే థెరపీ కేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది.
సంగీతం వినోదానికి మాత్రమే కాకుండా హీలింగ్‌కు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ రూపొందించబడింది. లోపల శబ్దం సమానంగా వినిపించేలా అత్యాధునిక అకౌస్టిక్ టెక్నాలజీ ఉపయోగించారు. గోళాకార నిర్మాణం వల్ల శబ్దం బయటకు వెళ్లకుండా, బయట శబ్దం లోపలికి రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ డోమ్‌లో ఉత్పత్తి అయ్యే ధ్వని ప్రకంపనలు ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.


.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!