

బాస్మతి బియ్యంతో తయారుచేసిన బిర్యానీ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కల్తీ లేదా పురుగు పట్టిన బియ్యం వాడితే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక చోట్ల కల్తీ ఆహార పదార్థాలు పెరుగుతున్నాయి. లాభాల కోసం కొందరు నాణ్యతను పట్టించుకోకుండా ఆహార పదార్థాలను కూడా వదలడం లేదు. దీంతో మనం తినే బాస్మతి బియ్యం నిజంగా సురక్షితమేనా అనే సందేహాలు ప్రజల్లో పెరుగుతున్నాయి.
సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తల ప్రకారం, కొన్ని హోటళ్లలో పురుగు పట్టిన బాస్మతి బియ్యాన్ని కూడా పారేయకుండా వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఇంట్లో బిర్యానీ లేదా పులావ్ తయారు చేసే ముందు బియ్యం నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలి. బియ్యం కడిగేటప్పుడు దుర్వాసన వస్తే లేదా పురుగులు కనిపిస్తే అవి ఉపయోగించకూడదు. మంచి నాణ్యమైన బియ్యం ప్రత్యేకమైన సువాసన కలిగి ఉంటుంది, కాబట్టి ఎప్పుడూ నాణ్యమైన బియ్యాన్నే వినియోగించడం మంచిది.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!