

పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన కాలగమనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ నిర్మించారు. ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఈ నెల 17న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సినిమాపై నమ్మకం వ్యక్తం చేశారు.
సినిమాలో కొత్తదనంతో కూడిన ప్రేమకథతో పాటు మంచి సందేశం ఉంటుందని యూనిట్ తెలిపింది. మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రాజ్ తేలు, నటుడు జబర్దస్త్ రాజమౌళి, అతిథిగా వచ్చిన బోలే షావలి సినిమాపై ప్రశంసలు కురిపించారు. హీరో రాజా బిరుదుల, హీరోయిన్ లావణ్య రామారావు ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని తెలిపారు. దర్శకుడు సుధాకర్ బుర్రి మాట్లాడుతూ, మంచి కంటెంట్ ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.




















.jpeg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!