
న్యూస్

అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో ముఖ్యమైన సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. ప్రపంచ వేదికపై మెరిసి భారత జట్టుకు కప్పు అందించడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ కుర్రాడు, ఇప్పుడు చదువులపై దృష్టి సారిస్తున్నాడు.
వైభవ్ సూర్యవంశీ ఈ నెల 17 నుంచి వచ్చే నెల 11 వరకు నిర్వహించనున్న పదో తరగతి సీబీఎస్ఈ పరీక్షలకు హాజరుకానున్నాడు. మైదానంలో ప్రతిభ చూపిన ఈ యువ ఆటగాడు, విద్యలోనూ సమానమైన కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. క్రీడా విజయాల తర్వాత పరీక్షా హాల్లోకి అడుగుపెడుతున్న అతనికి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!