

క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్. ఇవాళ (ఏప్రిల్ 13) ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ స్టేడియం నుంచి తిరిగి వెళ్లే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా మెట్రో సేవలను అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించింది. సాయంత్రం సమయంలో ఏర్పడే భారీ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని అభిమానులు మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. అన్ని కారిడార్ల నుంచి ప్రయాణికులు ఉప్పల్ మరియు ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ల ద్వారా స్టేడియానికి చేరుకోవచ్చని తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. నాగోల్ నుంచి హబ్సిగూడ (ఉప్పల్ జంక్షన్ వరకు), బోడుప్పల్ నుంచి అంబర్పేట్ (ఉప్పల్ జంక్షన్, రామాంతపూర్ మార్గం) వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని సూచించారు. లారీలు, డంపర్లు, ట్రక్కులు, టిప్పర్లు, వాటర్ ట్యాంకర్లు, ఆర్ఎంసీ వాహనాలు, జేసీబీలు, ఐచర్ వాన్లు, ప్రైవేట్ బస్సులు మరియు ట్రాక్టర్లు తప్పనిసరిగా డైవర్షన్ రూట్లలోనే వెళ్లాలని పోలీసులు స్పష్టం చేశారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తే ఇబ్బందులు ఉండవని అధికారులు తెలిపారు.

_1775900374811.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!