

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. బిల్లు ప్రవేశపెట్టిన విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో ఈ చర్యలకు దిగుతోందని ఖర్గే ఆరోపించారు.
దిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే, ప్రతిపక్షాలను బలహీనపర్చడానికే ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకువస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ అంశానికి మద్దతు ఉన్నప్పటికీ, జనాభా లెక్కలు పూర్తి కాకుండానే డీలిమిటేషన్‌ను చేర్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు అధికారాలను కార్యనిర్వాహక వ్యవస్థ తన చేతుల్లోకి తీసుకుంటోందని, అన్ని విపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!