

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ బహిరంగ లేఖ రాశారు. కేంద్రం ప్రతిపాదించిన 2011 జనాభా లెక్కల ఆధారంగా జరగనున్న డీలిమిటేషన్ ప్రక్రియపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే, రాష్ట్ర రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాలకు పెద్ద నష్టం జరుగుతుందని షర్మిల పేర్కొన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తన రాజకీయ ప్రాధాన్యతతో పాటు, భవిష్యత్తులో వచ్చే ఆర్థిక అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేసే ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి బహిరంగంగా వ్యతిరేకించాలని ఆమె కోరారు. అలాగే రాష్ట్రానికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరినీ పార్టీ భేదాలు లేకుండా ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పార్లమెంటులో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని సూచించారు.
అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ అంశంపై చర్చించి, డీలిమిటేషన్ ప్రతిపాదనను తిరస్కరించే తీర్మానం ఆమోదించాలని కూడా ఆమె సూచించారు. ఈ నిర్ణయం కేవలం రాజకీయ పరమైనది కాదని, ప్రజల హక్కులను రక్షించాల్సిన రాజ్యాంగ బాధ్యతగా చూడాలని షర్మిల స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!