
న్యూస్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ మహేష్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కలిసి పోటీ చేసినా కాంగ్రెస్‌పై ప్రభావం ఉండదని అన్నారు.
బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చినా, బీజేఆర్ఎస్గా మార్చినా ఎలాంటి మార్పు ఉండదని, ఆ పార్టీలకు తిరిగి ఎదిగే అవకాశమే లేదని విమర్శించారు. సింగరేణికి సంబంధించిన అన్ని ఒప్పందాలు బీఆర్ఎస్ పాలనలోనే జరిగాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎవరూ పోటీ కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!