
న్యూస్

ఇరాన్‌పై ఇప్పటికే కొనసాగుతున్న దాడులను మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే భూతల పోరాటానికీ సిద్ధమని, సైన్యాన్ని పంపించడానికీ వెనుకాడబోమని తెలిపారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని ధ్వంసం చేయడం, నౌకాదళాన్ని బలహీనపరచడం, అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు. యుద్ధం నాలుగు నుంచి ఐదు వారాలు కొనసాగవచ్చని అంచనా వేశారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అవసరమైతే నేలపై సైన్యాన్ని మోహరించే అవకాశాన్ని కూడా ఖండించలేమని చెప్పారు. ఇరాన్‌పై దాడులకు సంబంధించి దేశీయంగా వచ్చిన వ్యతిరేకతను పట్టించుకోనని, తమ చర్యలు సముచితమని పేర్కొన్నారు. బ్రిటన్‌తో ఉన్న వ్యూహాత్మక సమన్వయ అంశాలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!