
సినిమాలు

దేశంలో మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో భద్రతా బలగాలు భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించాయి. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మోస్ట్ వాంటెడ్ నాయకుడు మిసిర్ బెస్రాను లక్ష్యంగా చేసుకుని ఈ గాలింపు కొనసాగుతోంది. కీలక ప్రాంతాల్లో నిఘా పెంచడంతో పాటు విస్తృత స్థాయిలో కూంబింగ్ చర్యలు చేపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాల ప్రత్యేక భద్రతా బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, సరిహద్దు గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!