

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం నిరుద్యోగులకు కీలక ప్రకటన చేశారు. రేపు మూడు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అటవీ శాఖలో 3,093 పోస్టుల భర్తీ జరగనుందని ఆయన తెలిపారు. సింగిల్ పోస్ట్ ఖాళీలు 25 ఉన్నాయని వివరించారు. ఇకపై ప్రతి నెల సగటున మూడు నోటిఫికేషన్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నియామక ప్రక్రియను గరిష్టంగా ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇకపై అన్ని పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలోనే నిర్వహించనున్నట్లు వెంకటేశం స్పష్టం చేశారు. పరీక్షల్లో పారదర్శకత కోసం కొత్త సాంకేతికతను తీసుకువస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు న్యాయం జరిగేలా అన్ని దశల్లో కఠినమైన పారదర్శక విధానం పాటిస్తామని ఆయన వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!