

విమానయాన సంస్థలకు ఊరట కలిగించేలా ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలకు గాను అంతర్జాతీయ విమానాల కోసం వినియోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను సుమారు 27 శాతం తగ్గించాయి. కిలోలీటరుకు దాదాపు 400 డాలర్ల మేర కోత విధించడంతో అంతర్జాతీయ ఏటీఎఫ్ ధర 1,100 డాలర్లకు చేరింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరిగిన చమురు ధరల కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న విమానయాన రంగానికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.
ఈ తగ్గింపుతో అంతర్జాతీయ, దేశీయ విమాన ఇంధన ధరలు దాదాపు సమాన స్థాయికి చేరాయి. ప్రస్తుతం అంతర్జాతీయ ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు సుమారు రూ.1.05 లక్షలు ఉండగా, ఢిల్లీలో దేశీయ ఏటీఎఫ్ ధర రూ.1.04 లక్షల వద్ద కొనసాగుతోంది. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంధన ఖర్చు 40 శాతం వరకు ఉండగా, ఇటీవల అది 55-60 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ ధరల తగ్గింపు విమానయాన సంస్థల ఆర్థిక భారం తగ్గించడంలో కీలకంగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!