

మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పశ్చిమ బెంగాల్లో ‘పోలీస్ రాజ్యం’ నడుస్తోందని ఆరోపించారు. టీఎంసీ సీనియర్ నేతలపై జరిగిన దాడులకు నిరసనగా కోల్కతాలోని రాణి రష్మోని రోడ్డులో నిర్వహించాలనుకున్న ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన మమత, ఈ నిర్ణయం రాజకీయ దురుద్దేశంతో తీసుకున్నదేనని ఆరోపించారు.
అనుమతి లభించకపోయినా తమ నిరసన కార్యక్రమం ఆగదని స్పష్టం చేసిన మమత, అవసరమైతే ఢిల్లీలో ఒంటరిగానే నిరసన చేపడతానని హెచ్చరించారు. టీఎంసీ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని ఆమె ఆరోపించారు. పార్టీ కార్యకర్తలను సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని పేర్కొంటూ, అన్ని సవాళ్లను ఎదుర్కొని టీఎంసీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!