

అంతర్జాతీయ క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా, సమర్థవంతంగా మార్చే దిశగా ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సమావేశంలో ఈ మార్పులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ సౌరవ్గంగూలీ కూడా పాల్గొన్నారు. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం, టెస్టు మ్యాచ్‌లలో తక్కువ వెలుతురు పరిస్థితులు ఏర్పడితే ఇరు జట్ల అంగీకారంతో రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్‌ను వినియోగించవచ్చు. అలాగే షెడ్యూల్ చేసిన డ్రింక్స్ విరామాల్లో హెడ్ కోచ్‌లు లేదా వారి ప్రతినిధులు ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి కల్పించారు. టీ20 మ్యాచ్‌లలో 15 నిమిషాల విరామాన్ని తప్పనిసరి చేయడంతో పాటు, లైట్ అసెస్మెంట్ విధానంలో మార్పులు, అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ల పరిశీలనకు హాక్-ఐ డేటా వినియోగం, లెగ్‌సైడ్ వైడ్ నిబంధనల పూర్తి అమలు వంటి కీలక నిర్ణయాలను ఆమోదించారు. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027ను ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!