
గాసిప్స్

నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ మాజీ భార్య సంగీత బీజేపీలో చేరనున్నారనే ప్రచారం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బీజేపీతో అనుబంధం ఉన్న ఓ ప్రముఖ నటి ద్వారా సంగీతను పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొన్ని మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్, సంగీతకు సంబంధించిన విడాకుల వ్యవహారంపై ఇప్పటికే పలు కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ తాజా ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ అంశంపై బీజేపీ, సంగీత లేదా విజయ్ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం వెలువడుతున్న సమాచారం మొత్తం ఊహాగానాలుగానే పరిగణించాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!