

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు అందించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇక దక్షిణ కోస్తా ప్రాంతంలో మరో రెండు రోజులపాటు ఈదురుగాలుల తీవ్రత కొనసాగనుంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున దక్షిణ కోస్తా తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. దీంతో దక్షిణ భారతదేశంలో వర్షాల కార్యకలాపాలు మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!