

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ముంబయిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను కలిశారు. ఈ సమావేశంలో పరస్పర ఆత్మీయ స్వాగతం లభించింది. లోకేశ్ మంగళగిరి చేనేత శాలువాతో సీఎంను సత్కరించి శ్రీవారి ప్రతిమను బహూకరించారు. సీఎం దేవేంద్ర ఫడణవీస్ గణేశ్ ప్రతిమను లోకేశ్‌కు అందజేశారు. ఈ భేటీలో ఏపీలో వచ్చిన పెట్టుబడులు, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”, విద్యా సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్ విధానాలపై లోకేశ్ వివరించారు. అలాగే మహారాష్ట్రలో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఆయన తెలుసుకున్నారు.
అంతకుముందు ఎయిర్‌ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో కూడా లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. విశాఖను ఏఐ, డేటా హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు, గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ డేటా సెంటర్లు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. దీనిపై సానుకూలంగా పరిశీలిస్తామని రాబిన్ ఖుదా హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!