
సినిమాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల విద్యాసంస్థలు, సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 15 వేల మంది ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుతం 60 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు మరింత కాలం సేవలందించే అవకాశం లభిస్తుందని అభిప్రాయపడ్డాయి. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులకేశవ్ మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!