
జనరల్

తెలంగాణలో ‘పెద్ది’ సినిమా విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వలేదు. అలాగే ప్రీమియర్ షోలు లేదా ప్రత్యేక బెనిఫిట్ షోలను నిర్వహించేందుకు కూడా అనుమతి లభించలేదు. దీంతో సినిమా సాధారణ నిబంధనల ప్రకారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
జూన్ 4 ఉదయం 8 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రెగ్యులర్ షోలు ప్రారంభం కానున్నాయి. సాధారణ టికెట్ ధరలతోనే సినిమా ప్రదర్శించబడనుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విడుదల రోజు భారీ స్పందన ఉంటుందని థియేటర్ యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!