

భారత్-ఒమన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి, ఇంధన సహకారం మరింత బలోపేతం కానుంది. ఈ డీల్ కింద భారత్ నుంచి ఒమన్‌కు ఎగుమతయ్యే 99.38 శాతం ఉత్పత్తులకు సుంక రహిత ప్రవేశం లభించనుంది. రత్నాలు, ఆభరణాలు, టెక్స్టైల్స్, ఔషధాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఆటోమొబైల్ భాగాలు, వ్యవసాయ ఉత్పత్తులు తదితర రంగాలకు ఇది భారీ ఊతాన్ని ఇవ్వనుంది. అదే సమయంలో ఒమన్ నుంచి దిగుమతి అయ్యే 78 శాతం ఉత్పత్తులపై భారత్ సుంక మినహాయింపులు కల్పించింది.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందం వ్యూహాత్మకంగా ప్రాధాన్యం సంతరించుకుంది. హర్మూజ్‌కు వెలుపల ఉన్న ఒమన్‌లోని సలాలా, దుఖ్మ్ వంటి పోర్టుల ద్వారా భారత్ చమురు, ఎల్ఎన్జీ దిగుమతులను మరింత విస్తరించుకునే అవకాశం ఏర్పడింది. ఇటీవలి కాలంలో ఒమన్ నుంచి దిగుమతులు గణనీయంగా పెరగడం, ముఖ్యంగా ముడి చమురు మరియు యూరియా కొనుగోళ్లు అధికమవడం, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!