
సినిమాలు

తిరుమలలో దాదాపు రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా ఆలయ పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు దర్శనం ముగించుకుని వసతి ప్రాంతాలకు తిరిగి వెళ్తున్న వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటితో నిండిన మార్గాల గుండా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!