

యుద్ధం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, పాకిస్థాన్లో జరిగిన ఇరాన్–అమెరికా మధ్యవర్తిత్వ చర్చలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. కాల్పుల విరమణపై స్పష్టత లేకపోయినా, ఆ సమావేశాల్లో చురుకుగా పాల్గొంటూ నవ్వుతూ కనిపించిన ఓ మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమెే నటాలీ ఎ. బేకర్. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ కావడంతో, ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది.
అమెరికా ఫారెన్ సర్వీస్‌లో సీనియర్ అధికారి అయిన నటాలీ ప్రస్తుతం ఇస్లామాబాద్లోని యూఎస్ రాయబార కార్యాలయంలో ఛార్జ్ డి అఫైర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2024లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా చేరి, 2025 నుంచి ప్రస్తుత పదవిలో కొనసాగుతున్నారు. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో విశేష అనుభవం కలిగిన ఆమె, ఖతార్ మరియు కువైట్‌లలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన ఆమెకు అరబిక్, స్పానిష్, ఫార్సీ, రష్యన్ భాషలపై మంచి పట్టు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె చురుకైన పాత్ర కారణంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!