
గాసిప్స్

మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వరలక్ష్మి తీర్పు వెలువరించారు. 2016లో ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్‌నాథ్ ఆమరణ దీక్ష చేపట్టగా, ఆయన ఆరోగ్యం క్షీణించింది.
ఈ ఘటనను ఆత్మహత్యాయత్నంగా పరిగణించిన పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ కేసులో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెల్లడించింది. కాగా, ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.














.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!