

విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, ద్రవిడ మున్నేట్ర కళగం ( డీఎంకే) ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. కన్యాకుమారి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విజయ్ మాట్లాడుతూ అవినీతి రహిత పాలనను అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు పథకాల కోసం దరఖాస్తులు చేయాల్సిన అవసరం లేకుండా, లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి లేకుండా, ప్రభుత్వ సేవలు నేరుగా వారి ఇంటి వద్దకే చేరుతాయని చెప్పారు.
మహాధనపురంలో జరిగిన సభలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో “ప్రయారిటీ కార్డ్” జారీ చేస్తామని ప్రకటించారు. ఈ కార్డ్ ద్వారా పుట్టినప్పటి నుంచి అన్ని సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతి తీవ్రంగా ఉందని ఆరోపించిన విజయ్, తాను చెప్పేవి అమలు చేయగల సాంకేతిక ప్రణాళికలేనని పేర్కొన్నారు. టీవీకే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే “తమిళనాడు ప్రభుత్వ సేవా పథకం” అమలు చేస్తామని, అన్ని సేవలను ఒకేచోట అందించే “వెట్రి తమిళనాడు సూపర్ యాప్”ను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో పాలనను ముందుకు తీసుకెళ్తామని, తమిళనాడును దేశ డిజిటల్ రాజధానిగా మార్చేందుకు ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!