

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ పథకాల అమలు, ఐటీడీఏల పనితీరును కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ డాక్టర్ వర్నాలి డేకా ప్రశంసించారు. ఇక్కడ అమలవుతున్న ఉత్తమ విధానాలను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం మే నెలలో జాతీయ స్థాయి కార్యశాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మాసబ్ ట్యాంక్‌లోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రాంతీయ కార్యశాలలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గిరిజన యువతకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, స్థానిక భాషల్లో విద్య అందించడం ద్వారా విద్యార్థుల ప్రతిభను పెంపొందించాలని సూచించారు. గిరిజన సహకార సంస్థల ద్వారా పెట్రోల్ బంకులు, వంటగ్యాస్ పంపిణీ కేంద్రాలను విస్తరించాలని నిర్ణయించారు. అటవీ హక్కుల చట్టం అమలు, వలసల నివారణ, పరిపాలనలో వేగం పెంచే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!