
క్రీడలు

హిందువులను సంఘటితం చేయడమే లక్ష్యంగా స్వయం సేవక్ సంఘ్‌ను కేశవ్ బలీరాం హెడ్గేవార్ స్థాపించారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. హిందువులంతా మరింత ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కందకుర్తి దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెంజల్ మండలం కందకుర్తిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటించారు.
కేశవ్ స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మందిరాన్ని ప్రారంభించిన అనంతరం భగవత్ ప్రసంగించారు. ప్రతి హిందువు స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. బ్రిటిష్ పాలకులను భారత్ నుంచి తరిమికొట్టాలని హెడ్గేవార్ ఆశించారని, ఆ కల చివరికి నెరవేరిందని మోహన్ భగవత్ పేర్కొన్నారు.



















.jpeg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!