

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం పై కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు–2026 పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో ఇది చట్టంగా మారింది. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది.
ఈ నిర్ణయం 2024 జూన్ 2 పాతకాలం నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో ప్రతిపాదించిన మూడు రాజధానుల విధానానికి ముగింపు పలుకుతూ, సెక్షన్ 5(2)లో సవరణలు చేసి అమరావతిని ఏకైక రాజధానిగా పేర్కొంది.
ఈ నిర్ణయంతో అమరావతికి చట్టపరమైన బలమైన హోదా లభించింది. భవిష్యత్తులో రాజకీయ మార్పులు జరిగినా రాజధాని మార్పు సులభం కాకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. ఈ పరిణామం పై అమరావతి రైతులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!