

దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి ఆలయంగా ప్రసిద్ధి చెందిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భవ్య పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది. రూ.225 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో 9 అంతస్తుల రాజగోపురం, ఈశాన్య దిశలో కోనేరు, ధ్యాన మందిరాలు, ఆలయ విస్తీర్ణాన్ని మూడు రెట్లు పెంచే ప్రణాళికలు ఉన్నాయి. ఈ పనులు శృంగేరి శారదా పీఠం అనుమతితో చేపడుతున్నారు. ఈ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం భూమిపూజ చేయనున్నారు.
పవిత్ర గోదావరి నది తీరంలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగి ఉంది. స్థల పురాణం ప్రకారం, వ్యాస మహర్షి కురుక్షేత్ర యుద్ధానంతరం ఇక్కడికి వచ్చి గోదావరి ఇసుకతో సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు విశ్వసిస్తారు. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ పునర్నిర్మాణం ద్వారా సంప్రదాయాన్ని కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!