
న్యూస్

తిరుపతి జిల్లా తిరుచానూరులో శనివారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తూర్పు మాడ వీధిలో కొందరిపై దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్వామివారి గజవాహన సేవ ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనానికి మార్గం ఇవ్వడంపై మొదలైన వివాదం క్రమంగా ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఆలయ వాహన బేరర్లపై దాడి జరిగినట్లు సమాచారం. ఘటనలో ముగ్గురు బేరర్లు గాయపడగా, వారు వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదాలు తరచుగా చోటు చేసుకోవడం వల్ల శాంతిభద్రతలపై ప్రభావం పడుతోందని అంటున్నారు. ఈ తరహా ఘటనలను నియంత్రించి భద్రతను కాపాడాలని వారు అధికారులను కోరుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!