
న్యూస్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌పై భారీ అంచనాలు కొనసాగుతున్నాయి. ‘హనుమాన్’ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు కుమారస్వామి నేపథ్యంలో మరో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు ఆయన కథ అందించడంతో పాటు నిర్మాణ పర్యవేక్షణ మాత్రమే చేయనుండగా, దర్శకత్వ బాధ్యతలను సముద్రఖని చేపట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరోవైపు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం రిషబ్ శెట్టి హీరోగా ‘జై హనుమాన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది. పౌరాణిక కథలతో తన యూనివర్స్‌ను విస్తరించాలనే లక్ష్యంతో ప్రశాంత్ వర్మ ముందుకు సాగుతున్నాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!