

ఐలాపూర్ తాండలో కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, నోటీసులు ఇవ్వకుండా చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. గజ్జా రంగారావు సహా పలువురు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి, పూర్తి వివరాలతో అధికారులు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. భూసేకరణ, నివాస హక్కుల విషయంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ స్పష్టం చేశారు.
ఇక ప్రభుత్వ భూములపై కంచె వేయడంలో కూడా నిబంధనలు కచ్చితంగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది. నిషేధిత జాబితాలో ఉన్నాయనే కారణంతో ఇష్టానుసారం కంచెలు వేయడం సరైంది కాదని హెచ్చరించింది. సంబంధిత భూమి ప్రభుత్వానికి చెందినదని స్పష్టమైన ధ్రువీకరణ లేకుండా చర్యలు తీసుకోరాదని పేర్కొంది. ఈ అంశంపై కలెక్టర్ నుంచి నివేదిక తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!