
గాసిప్స్

రాష్ట్రంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లా భైంసా బస్ డిపో సమీపంలో కారు, కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు కుబీర్ మండలానికి చెందిన బాబన్న, భోజరామ్ పటేల్, రాజన్న, వికాస్లుగా గుర్తించారు. మృతదేహాలను భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!