

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న డేవిడ్ రెడ్డి సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో రీషూట్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. షూటింగ్ పూర్తి అయినా అవుట్‌పుట్‌లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బ్రిటిష్ వారిపై పోరాడిన యోధుడు డేవిడ్ రెడ్డి కథను తెలియజేస్తుంది.
ఈ సినిమాలో 700 కేజీల బరువున్న వార్ డాగ్ బైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మంచు మనోజ్ సరసన ప్రిన్స్ హీరోయిన్ మరియా నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఆడియెన్స్‌కు కొత్త అనుభవం ఇవ్వనుంది. మంచు మనోజ్ ఫస్ట్ లుక్ ఇప్పటికే ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.బ్రిటిష్ ఎరా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, ఎమోషన్స్, వార్ సీక్వెన్సెస్ భారీగా ఉండనున్నాయి. ఇంటర్వెల్ బ్లాక్‌ను మరింత ఇంపాక్ట్‌ఫుల్‌గా మార్చాలని రీషూట్ నిర్ణయం తీసుకున్నారు.
మంచు మనోజ్ ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ మీల్స్ ఫీస్ట్‌గా ఉంటుందట. రవి బస్రూర్ మ్యూజిక్‌తో యాక్షన్ సీన్స్ మరింత ఎలివేట్ అవుతాయట. ఈ పీరియాడికల్ డ్రామా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!