
రాజకీయాలు

జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లోయలో పడిపోయిన బస్సు ప్రమాదంలో కనీసం 16 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రామ్ నగర్ నుంచి ఉధంపూర్‌కు వెళ్తున్న సమయంలో జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో 40కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం వెంటనే రక్షణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!