
న్యూస్

నందమూరి నటసింహం బాలకృష్ణ 111వ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. అఖండ 2 తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. కొన్ని మార్పుల కారణంగా కొద్దిగా ఆలస్యం అయిన ఈ చిత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో షూటింగ్ ప్రారంభించింది.
ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. సింహా, జై సింహా, శ్రీరామ రాజ్యం తర్వాత ఈ జంట మళ్లీ కలవడం ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచింది. వృద్ధి సినిమాస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ మరియు మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!