
న్యూస్

రామ్ పోతినేని తన తదుపరి సినిమాకు తానే కథ రాసుకుంటున్నారని తాజా సమాచారం. ఆంధ్ర కింగ్ తాలూకా తర్వాత ఆయన కొత్త అవతారంలో కనిపించనున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌గా 'ది లోన్ వోల్ఫ్' ప్రచారంలో ఉంది. ఇదే ఫైనల్ టైటిల్ అయ్యే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను రామ్ తన సోదరుడితో కలిసి నిర్మించనున్నారని సమాచారం. కథ తనదే కావడంతో దర్శకత్వ బాధ్యతలను కూడా రామ్ తీసుకునే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి. అయితే దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. తన సొంత కథతో వస్తున్న ఈ ప్రాజెక్ట్ రామ్ కెరీర్లో మలుపు తిప్పుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!