

తమిళ దర్శకుడు అట్లీ మరియు ఆయన భార్య ప్రియ మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. వారికి ఆడబిడ్డ జన్మించింది. ఈ ఆనంద వార్తను వారు సోషల్ మీడియాలో ఎంతో యూనిక్‌గా ప్రకటించారు. ఈ జంట మొదటిసారిగా ఈ ఏడాది జనవరిలో గర్భధారణ విషయాన్ని ప్రకటించారు. ఆ సమయంలో కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో తమ కుమారుడు మీర్ కోణం నుండి అభిమానులకు తెలిపారు.
ఇప్పుడు కూడా మీర్‌కు చెల్లి పుట్టిందని ఒక క్రియేటివ్ పోస్టర్‌తో తెలిపారు. ఈ వార్తకు సమంత, కాజల్ అగర్వాల్, అనన్య పాండే, నిషా అగర్వాల్ వంటి సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. అలాగే దీపికా పదుకొణె కూడా ఇటీవల ఇలాంటి ప్రత్యేక శైలిలో తన గర్భధారణను ప్రకటించిన విషయం తెలిసిందే.
అట్లీ 2014లో ప్రియను వివాహం చేసుకున్నారు. 2023లో వారికి కుమారుడు మీర్ జన్మించాడు. ఇప్పుడు సుమారు మూడేళ్ల తర్వాత నిన్న వారికి ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం అట్లీ తన కొత్త సినిమా “రాకా” పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో అల్లు అర్జున్ మరియు దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
















.png&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!