

నటుడు, విజయ్ మరియు ఆయన భార్య సంగీత మధ్య కొనసాగుతున్న విడాకుల కేసు చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. కోర్టు ఈ కేసును జూన్ 15కు వాయిదా వేస్తూ, ఆ రోజున ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి అనుమతి కోరగా, కోర్టు నిరాకరించి ప్రత్యక్షంగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
ఇక మరోవైపు వీరిద్దరి మధ్య సెటిల్మెంట్పై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నామినేషన్లో చూపిన ఆస్తుల ఆధారంగా రూ.250 కోట్లు సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత కోరినట్లు సమాచారం. పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఏర్పాట్లు చేయాలని ఆమె అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అయితే, సంగీతకు రూ.35 కోట్లు సెటిల్మెంట్ ఇవ్వడానికి విజయ్ అంగీకరించినట్లు, పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటానని తెలిపినట్లు కోలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.

.jpg&w=3840&q=75)




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!