
ఓటిటి

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. వచ్చే నెల 1న జరుపుకునే మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆటోరిక్షా మరియు టాక్సీ డ్రైవర్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తూ రవాణా శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇకపై మహారాష్ట్రలో పర్మిట్ పొందాలన్నా లేదా డ్రైవర్గా కొనసాగాలన్నా మరాఠీ భాషపై ప్రాథమిక అవగాహన ఉండటం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం ద్వారా స్థానిక భాషకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, ప్రయాణికులతో మెరుగైన కమ్యూనికేషన్ సాధించాలనే ఉద్దేశం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!