
జనరల్

అక్షయ తృతీయకు ముందు మహిళలకు గుడ్ న్యూస్‌గా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,300 తగ్గి ప్రస్తుతం రూ.1,54,200గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,250 తగ్గి రూ.1,41,500కు చేరింది. 18 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములపై రూ.1,030 తగ్గి ప్రస్తుతం రూ.1,15,650 వద్ద ఉంది.
మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,75,000గా కొనసాగుతోంది. ఈ ధరల తగ్గుదలతో బంగారం కొనుగోలుదారులకు ఊరట లభించినట్లు కనిపిస్తోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!